AP Govt decided to treat tenth class Supplementary Exams appearing students as regular pass Students | సాధారణంగా సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్‌గానే పరిగణిస్తుంటారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే 'కంపార్టుమెంటల్ పాస్'ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు... సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కంపార్టుమెంటల్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు.
#10thclass
#APGovt
#students